సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం 'కొండ పొలం'. ప్రతిభగల క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. 

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం 'కొండ పొలం'. ప్రతిభగల క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ అదే ఉత్సాహంతో రెండో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అక్టోబర్ 8న రిలీజ్ కాబోతున్న కొండ పొలం చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. క్రిష్ మార్క్ తో ఉన్న ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అడివిలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది. గొర్రెల కాపరుల కుటుంబం నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ బాగా చదువుకున్న యువకుడిగా కనిపిస్తున్నాడు. 

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఓ ఇంటర్వ్యూకి వెళ్లగా.. గొర్రెల కాపరుల కుటుంబం.. తల్లి దండ్రులకు చదువు లేదు.. ఏ కోచింగ్ సెంటర్ లో ట్రైన్ అయ్యారు అని ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ని ప్రశ్నిస్తారు. 'అడవి సర్.. నల్లమల అడవి' అంటూ వైష్ణవ్ తేజ్ ఇచ్చే సమాధానం ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ళ నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలం అవుతున్న యువకుడిగా వైష్ణవ్ తేజ్ బాగా నటిస్తున్నాడు. 

అలాగే గొర్రెల కాపరిగా కూడా ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో వైష్ణవ్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక అడవిలో ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇక కోట శ్రీనివాస రావు రాయలసీమ యాస డైలాగులతో మెప్పిస్తున్నారు. మొత్తంగా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. 

YouTube video player