వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా. దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తుండగా విడుదల తేదీ ప్రకటించారు. 

ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్(vaishnav Tej)తేజ్ భారీ హిట్ అందుకున్నారు. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ మూవీ నిర్మాతలతో పాటు బయ్యర్ల జేబులు నింపింది. ఉప్పెన మూవీ వైష్ణవ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. కృతి శెట్టి అయితే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఆమె ఖాతాలో అరడజను చిత్రాల వరకు ఉన్నాయి. ఇక ఉప్పెన తర్వాత వైష్ణవ్ మాత్రం ప్లాప్ కొట్టాడు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. 

ఇక మూడవ చిత్రం వైష్ణవ్ రంగ రంగ వైభవంగా చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రంగ రంగ వైభవంగా తెరకెక్కింది. రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం సమకూర్చారు. రంగ రంగ వైభవంగా చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. కాగా నేడు మూవీ విడుదల తేదీ ప్రకటించారు. సెప్టెంబర్ 2న రంగ రంగ వైభవంగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. 

ఇక హీరోయిన్ కేతిక శర్మ(Ketika Sharma)మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె నటించిన రొమాంటిక్, లక్ష్య అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో రంగ రంగ వైభవంగా మూవీపై ఆమె ఆశలు పెట్టుకున్నారు.ఇక అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మగా తెరకెక్కించాడు దర్శకుడు గిరీశాయ. విక్రమ్ కుమారుడు ధృవ్ డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఆదిత్య వర్మ నిరాశపరిచింది. గిరీశాయ రంగ రంగ వైభవంగా మూవీతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.