`ఉప్పెన` సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన వైష్ణవ్‌ తేజ్‌ మరో సినిమాతో రాబోతున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారు చేశారు. దీనికి `కొండపొలం` అనే పేరు పెట్టారు. నేడు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. 

వైష్ణవ్‌ తేజ్‌ `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్‌ హీరోగా నిలిచాడు. అత్యంత క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. డెబ్యూ చిత్రమే ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేయడం టాలీవుడ్‌ చరిత్రలోనే రికార్డ్ గా చెప్పొచ్చు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించిన వైష్ణవ్‌ తేజ్‌ మరో సినిమాతో రాబోతున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారు చేశారు. దీనికి `కొండపొలం` అనే పేరు పెట్టారు. నేడు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. 

Scroll to load tweet…

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ ఫస్ట్ లుక్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇందులో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు వైష్ణవ్‌ తేజ్‌. ఇందులో కటారు రవింద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌ కనిపించనున్నారట. అటవి ప్రాంతంలో ఈ సినిమా సాగుతుందని, పెద్దోళ్ల ఆగడాలను అడ్డుకునే వ్యక్తిగా వైష్ణవ్‌ కనిపించబోతున్నట్టు ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. 

YouTube video player

ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఫస్ట్ ఫ్రేమ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 8న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.