మెరుపులా వచ్చిన సాయి ధరమ్ తేజ ...మాస్ లోకి చాలా స్పీడుగా దూసుకుపోయాడు. వివి వినాయిక్ వంటి దర్శకుల చేతుల్లోకి వెళ్లాడు. హిట్స్ ఇచ్చాడు. అంతకు మించి ప్లాఫ్స్ ఇచ్చాడు. అయితే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పెద్ద బ్యానర్..పెద్ద డైరక్టర్ అన్నట్లుగానే అతని హవా నడుస్తోంది. ఈ ఊపులోనే తన తమ్ముడుని సైతం సినీ పరిశ్రమలోకి లాక్కొస్తున్నాడు. 

మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వస్తున్నారు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ తెరంగేట్రం సైలెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన  మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి బుచ్చిబాబు సామా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు గతంలో సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలోనూ, ‘రంగస్థలం’ చిత్రానికి రచయితగానూ పనిచేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నట్టు నిర్మాణ సంస్థలు తెలిపాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

వైష్ణవ్‌ తేజ్‌  ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే వైష్ణవ్‌ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలైనట్టుగా వార్తలు వినిపించాయి.   నారా రోహిత్ , శ్రీవిష్ణు ల కాంబినేషన్ లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర డైరక్షన్ లో సినిమా ఉంటుందని వార్తలువచ్చాయి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా బుచ్చిబాబు అనే కొత్త దర్శకుడుతో సినిమా మొదలైంది. 

ఇక వైష్ణవ్‌ తేజ్‌... గతంలో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో పేషెంటుగా కూడా నటించాడు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ తన చదువుకు కొనసాగిస్తూ నటన, డాన్స్, ఫైట్స్ ఇలా వివిధ కేటగిరీల్లో శిక్షణ పొందినట్లు సమాచారం.  వైష్ణవ్ తేజ్ తన లాంచింగ్ కోసం చాలా మంది కథలు విన్నారని సమాచారం.  సినిమాల ఎంపిక షయంలో అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సలహా తీసుకుంటాడని చెప్తున్నారు.