`వారసుడు` చిత్రం వాయిదా పడింది. తమిళంలో సేమ్ డేట్‌కి రిలీజ్ కానుంది. కానీ తెలుగులో మాత్రం ఈ నెల 14న రిలీజ్ కానుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.
విజయ్ హీరోగా నటించిన `వారసుడు` చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళంలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. తమిళంలో సేమ్ డేట్‌కి రిలీజ్ కానుంది. కానీ తెలుగులో మాత్రం ఈ నెల 14న రిలీజ్ కానుందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు వెల్లడించారు.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ నటించిన `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు భారీ రిలీజ్ ఉండటంతో థియేటర్ల సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దిల్‌రాజు. దీనిపై పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏది జరిగినా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సినిమాపై నమ్మకంతో తాను వెనక్కి తగ్గినట్టు చెప్పారు. ఒక చోట హిట్ అయిన సినిమా వేరే భాషలో గ్యాప్‌తో రిలీజ్ అయినా హిట్ అవుతున్నాయి. ఇటీవల `కాంతార`నే అందుకు ఉదాహరణ. మా సినిమా కూడా అలానే తెలుగులోనూ ఆడుతుందన్నారు.
