Asianet News TeluguAsianet News Telugu

Vaarasudu Collections : ‘వారసుడు’ తొలిరోజు వసూళ్లు ఎంత? తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఇలా!?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘వారసుడు’. జనవరి 14న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే, తాజాగా అందించిన వివరాల ప్రకారం.. తొలిరోజు చిత్ర కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
 

Vaarasudu movie first day collections in telugu states!
Author
First Published Jan 15, 2023, 7:13 PM IST

తమిళ హీరో విజయ్ (Vijay Thalapathy) - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’గా జనవరి 11న విడుదలవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా నిన్న (జనవరి 14)న విడుదలైంది. ఈ చిత్రానికి ముందు యాక్షన్ ఫిల్మ్స్  ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ అయ్యి థిటయేర్లలో మాస్ రెస్సాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెరకెక్కించిన Vaarasudu కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అయితే, భారీ అంచనాలతో తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందనే ఆసక్తిగా మారింది. తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో డే1 కలెక్షన్స్ వివరాలు అందాయి. ఆ సమాచారం ప్రకారం.. ఏపీ మరియు తెలంగాణలో  ఫస్ట్ డే ‘వారసుడు’ రూ.5.80 కోట్ల గ్రాస్, రూ.3.10 కోట్ల షేర్ వసూల్ చేసినట్టు సమాచారం. 

ఏరియా వైజ్ గా వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాం : రూ.1.40 కోట్లు
సీడెస్ : రూ. 45 లక్షలు
యూఏ : 40 లక్షలు
ఈస్ట్ : 18 లక్షలు
వెస్ట్ : 17 లక్షలు
గుంటూరు : 18 లక్షలు
కృష్ణ : రూ.19 లక్షలు
నెల్లురూ : రూ. 13 లక్షలు వసూల్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే, చివరిగా విడుదలైన విజయ్ దళపతి చిత్రాల ఓపెనింగ్స్ కంటే ‘వారసుడు’ కలెక్షన్స్ తక్కువేనని తెలుస్తోంది. ‘మాస్టర్’ చిత్రం రూ.6.01 కోట్ల షేర్, ‘బీస్ట్’ చిత్రం రూ.4.81 కోట్లు వసూల్ చేయగా.. తాజాగా ‘వారసుడు’ రూ.3.10 కోట్లు వసూల్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా లాంగ్ రన్ కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మున్ముందు కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా నేటి వరకు ‘వారసుడు’ రూ.120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. చిత్రంలో విజయ్ - రష్మిక మందన్న జంటగా అలరించారు. థమన్ సంగీతం అందించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios