Asianet News TeluguAsianet News Telugu

`వారసుడు`ని డైలీ సీరియల్‌తో పోల్చిన నెటిజన్‌.. దర్శకుడు వంశీపైడిపల్లి ఫైర్‌..

విజయ్‌ హీరోగా నటించిన `వారసుడు` చిత్రం `డైలీ సీరియల్‌` లాగా ఉందని ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో దర్శకుడు వంశీపైడిపల్లి స్పందించారు. స్ట్రాంగ్‌ కౌంటర్లిచ్చాడు.

vaarasudu look like daily serial director vamshi paidipally strong counter to netizens
Author
First Published Jan 18, 2023, 7:50 AM IST

దళపతి విజయ్‌ హీరోగా నటించిన `వారసుడు` చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. సినిమాకి యావరేజ్‌ టాక్‌ వచ్చినా సంక్రాంతి కావడంతో కలెక్షన్లు బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ని దాటింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే. దిల్‌రాజు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ నిర్మించిన చిత్రమిది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా, శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాక తెలుగులో నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఇప్పటికే చూసేసిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తలపించేలా ఉందని,  ఓ పది వెంకటేష్‌ సినిమాలు కలిపి చేసినట్టు ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే అదే అసహనాన్ని కొందరు తమిళ నెటిజన్లు కూడా వ్యక్తం చేశారు. `డైలీ సీరియల్‌`ని తలపించేలా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు వంశీపైడిపల్లి రియాక్ట్ అయ్యారు. ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. నెటిజన్ కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. 

సినిమా తీయడం చాలా కష్టమైన పని అని, అదొక టీమ్‌ వర్క్ అని, ప్రేక్షకులను అలరించడానికి ఎంతగా కష్టపడతామో తెలుసా? బ్రదర్‌ ఇది జోక్‌ కాదు, ప్రతి సినిమా వెనక ఎన్నో  త్యాగాలు  ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న సూపర్‌ స్టార్స్ లో విజయ్‌ ఒకరు.  సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారు. ప్రతి పాటకు, ప్రతి డైలాగ్‌కి రిహార్సల్స్ చేస్తారు. సినిమా కోసం కష్టపడతాం, కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. ఆయన నా సినిమాకి సమీక్షకుడు, విమర్శకుడు, ఆయన కోసం సినిమా చేశా`నని తెలిపారు వంశీపైడిపల్లి. 

డైలీ సీరియల్‌ అనే కామెంట్లపై రియాక్ట్ అవుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సినిమాని సీరియల్స్ తో పోల్చడమేంటన్నారు. సాయంత్రమైతే ఎంత మంది టీవీలు చూస్తారో మీకు తెలుసా? మీ ఇళ్లల్లో చూసుకోండి,  ప్రతి ఒక్కరూ ఏదో ఒక సీరియల్‌ చూస్తుంటారు. ఎంతో మందికి అవి వినోదాన్నిస్తున్నాయి. వాటిని తక్కువ చేసి మాట్లాడవద్దని, అది కూడా క్రియేటివ్‌ వర్క్ అని  హితవు పలికారు. 

ఇంకా దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ, ఇతరులను కిందికి లాగాలంటే మొదట నిన్ను నువ్వు కిందకి లాగుతున్నట్టే, మరీ అంత నెగటివిటీగా ఉండకండి, మీరు నెగటివ్‌గా ఆలోచించడం మొదలు పెడితే, అది మిమ్మల్ని  తినేస్తుంది. ఇలాంటి వాటిని నేను సీరియస్‌గా తీసుకోను.  నా వర్క్ ని, నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోను, సాఫ్ట్ వేర్‌ జాబ్‌ వదులుకుని ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. నేనొక కమర్షియల్‌ సినిమా తీశా.అంతేగానీ నేనేదో అద్భుతమైన సినిమా తీశానని  చెప్పడం లేదు, మీలాంటి ఆడియెన్స్ ని అలరించేందుకే సినిమా తీశా, వారసుడు అలానే అలరిస్తుంది`  అని గట్టిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios