ఇలయ దళపతి విజయ్ విజయ్ నటించిన వారసుడు చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి కొన్ని రోజుల ముందు చిత్ర యూనిట్ కి బిగ్ షాక్ తగిలింది. వారసుడు చిత్రానికి పనిచేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు(50) అకస్మాత్తుగా మరణించారు. 

ఇలయ దళపతి విజయ్ విజయ్ నటించిన వారసుడు చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి 11న వారసుడు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన వారసుడు ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రిలీజ్ కి కొన్ని రోజుల ముందు చిత్ర యూనిట్ కి బిగ్ షాక్ తగిలింది. వారసుడు చిత్రానికి పనిచేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు(50) అకస్మాత్తుగా మరణించారు. నిన్న సునీల్ బాబుకి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు కేరళలోని ఆసుపత్రిలో చేర్పించారు. 

కానీ చికిత్స తీసుకుంటూ ఆయన మరణించారు. దీనితో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, ఆయనతో పనిచేసిన సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా వారసుడు చిత్ర యూనిట్ కి ఇది బిగ్ షాక్. 

కన్నడ దర్శకురాలు అంజలి మీనన్.. సునీల్ బాబు మరణం పట్ల తీవ్ర విషాదం వ్యక్తం చేసింది. ఆమె తెరకెక్కించిన బెంగళూరు డేస్ చిత్రానికి సునీల్ బాబు పనిచేశారు. ఆ మెమొరీస్ ని ఆమె గుర్తు చేసుకున్నారు. సునీల్ బాబు.. హిందీ గజినీ, సీతారామం, ఎంఎస్ ధోని , ఊపిరి, వారసుడు, తుపాకీ లాంటి చిత్రాలు పని చేశారు. సునీల్ బాబుకి భార్య, కుమార్తె ఆర్య ఉన్నారు. 

View post on Instagram