నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘వి’కు అదే జరిగిందని సమాచారం. ఈ సినిమాని ఎట్టి పరిస్దితుల్లోనూ ఓటీటికు తీసుకురాకూడదనేది నాని ఆలోచన. కానీ రోజు రోజుకూ మారిపోతున్న పరిస్దితులు, ప్రాజెక్టు స్టేల్ అయ్యిపోతుందనే భయం దిల్ రాజుకు ..ఓటిటి వైపు మ్రొగ్గేలా చేసాయి. అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా ఫైనల్ ఎగ్రిమెంట్ చేసారు. దాంతో ఇప్పుడు ఇదే రూటులో చాలా సినిమాలు ప్రయాణం పెట్టుకుంటున్నాయి.
కొన్ని నిర్ణయాలు తప్పనిసరి పరిస్దితుల్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా కోట్లుతో జరిగే బిజినెస్ లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘వి’కు అదే జరిగిందని సమాచారం. ఈ సినిమాని ఎట్టి పరిస్దితుల్లోనూ ఓటీటికు తీసుకురాకూడదనేది నాని ఆలోచన. కానీ రోజు రోజుకూ మారిపోతున్న పరిస్దితులు, ప్రాజెక్టు స్టేల్ అయ్యిపోతుందనే భయం దిల్ రాజుకు ..ఓటిటి వైపు మ్రొగ్గేలా చేసాయి. అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా ఫైనల్ ఎగ్రిమెంట్ చేసారు. దాంతో ఇప్పుడు ఇదే రూటులో చాలా సినిమాలు ప్రయాణం పెట్టుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించి ట్రైలర్ కట్ చేస్తున్నారు. నాని కు ట్రైలర్ కట్ చేసి పంపారట. అయితే నాని ఆ ట్రైలర్ చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదని, మీకు ఎలా తోస్తే అలా ముందుకు వెళ్లమని ముభావంగా చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నానికు కోపం వచ్చిందని అర్దమైనా, చేయగలగింది ఏముంది అని టీమ్ ...ఓటీటి రిలీజ్ కు సంభందించిన ఏర్పాట్లలలో మునిగిపోయారట.
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ లుగా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్,టీజర్ కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.
నాని ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను క్రిసమస్ కానుకగా విడుదల కానుందా లేదా అన్నది సస్పెన్స్.
