నాని, సుధీర్ కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వి' విడుదలకు సిద్ధం అయ్యింది. ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ లో వి విడుదల కానుంది. నాని 25వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక థియేటర్ రిలీజ్ కి ఏమాత్రం తగ్గకుండా నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. చిత్ర ట్రైలర్ ద్వారా మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ కాగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. 

కాగా వి మూవీ ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఈ వేడుక గురించి అధికారిక ప్రకటన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. హీరోలు నాని, సుధీర్ హీరోయిన్స్ నివేదా థామస్, అదితి రావ్ హైదరి వేడుకలో సందడి చేయనున్నారు. అలాగే చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ, నిర్మాత దిల్ రాజు కూడా హాజరుకున్నారు. 

అలాగే  ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే, మరి వేదిక ఎక్కడనేగా మీ డౌట్. మీ మొబైల్ అండ్ టెలివిజన్ తెరనే వేదిక వెన్యూ. ఈ ప్రీరిలీజ్ వేడుకకు ప్రత్యక్ష ఆహ్వానం ఎవరికి లేదు. లైవ్ లో వేడుకను చూసి ఎంజాయ్ చేయడమే. ఇక వి మూవీలో నాని సైకో కిల్లర్ రోల్ చేస్తుండగా, సుధీర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు.