నేచురల్ స్టార్ నాని, సుధీర్‌  బాబు హీరోలుగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వినిపించింది. దీనికి తో ఈ సినిమా నేపథ్య సంగీతం  కాపీ అంటూ విమర్శలు రావటంతో చిత్రయూనిట్ తలపట్టుకున్నారు.

అల వైకుంఠపురములో సినిమా సూపర్‌ హిట్‌ కావటంలో తమన్‌ మ్యూజిక్‌ కూడూ కీరోల్‌ ప్లే చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో సూపర్ హిట్ కావటంతో తమన్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. అయితే ఆ సినిమాతో వచ్చిన పేరు వి సినిమాతో పోయిందన్న టాక్ వినిపిస్తోంది. వి సినిమాకు కేవలం నేపథ్య సంగీతాన్ని మాత్రమే అందించాడు తమన్‌. అయితే ఈ సినిమాలో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అద్భుతంగానే ఉన్నా.. అది తమిళ సూపర్ హిట్ రాక్షసన్‌, హాలీవుడ్ మూవీ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌కు కాపీ అన్న టాక్‌ వినిపిస్తోంది.

గతంలోనూ తమన్‌పై కాపీ క్యాట్ అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వివాదంపై వి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ స్పందించాడు. `అన్నపూర్ణ స్టూడియోలో ఇంజనీర్లు కూడా పాత ట్యూన్‌ వాడుతున్నారేంటి అని అడిగారు. కానీ రాక్షసన్‌లోని బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌, విలో వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తిగా వేరు వేరు. కాకపోతే మ్యూజిక్ నాలెడ్జ్‌ లేని వాళ్లు ఈ మ్యూజిక్‌ను కాపీ అంటున్నారు. ఈ సినిమా అనే కాదు ఇతర సినిమాల విషయంలో కూడా ఇలాంటి కాపీ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తన తరుపున క్లారిటీ ఇవ్వటంపై తమన్‌ కూడా హర్షం వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు కూడా మీలా క్లారిటీ ఇవ్వలేడు లవ్‌ యూ సర్‌ అంటు కామెంట్ చేశాడు తమన్‌.