ఈ జనరేషన్ నటీనటులు తమ తోటి నటీనటుల పనితనాన్ని మెచ్చుకోవడంతో పాటు వారి సినిమాల ప్రమోషన్స్ కి కూడా సహాయం చేస్తున్నారు. తాజాగా నటి సమంత తన తోటి హీరోయిన్ పై ప్రశంసలు కురిపించింది.

మలయాళ నటి పార్వతి నటించిన 'ఉయరే' సినిమాను సమంత రీసెంట్ గా చూశారట. ఇందులో పార్వతి ప్రేమికుడి చేతిలోనే యాసిడ్ దాడికి గురైన యువతిగా నటించారు. పైలట్ కావాలని ఆశించిన ఆ యువతి యాసిడ్ దాడికి గురైన తరువాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందనే అంశాలతో సినిమాను తెరకెక్కించారు. 

కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన సమంత తన ట్విట్టర్ లో ''ఉయరే చిత్రాన్ని తప్పక చూడండి.. ఈ సినిమాకి మీకు కోపాన్ని తెప్పిస్తుంది.. ఏడిపిస్తుంది.. ఆలోచింపజేస్తుంది.. ప్రేమించేలా చేస్తుంది. మీలో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ప్రోత్సాహాన్నిస్తుంది'' అంటూ రాసుకొచ్చింది.

సినిమాలో నటించిన పార్వతిని పొగుడుతూ.. మీరు మాకు గొప్ప ఘనత అని చెప్పింది. దర్శకుడు మను అశోకన్, కథారచయిత బాబీ సంజయ్ లకు శుభాకాంక్షలు చెప్పింది. ఈ ట్వీట్ చూసిన పార్వతి వెంటనే పార్వతికి ధన్యవాదాలు చెప్పింది.