తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ పైనల్ ఫేజ్ కు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి నెలకొల్పారు.  

ఎలా మొదలుపెట్టామని కాదు, ఏవిధంగా ముగింపు పలికాం అనేది కూడా ముఖ్యం. ఆహా పేరుకి తగ్గట్టుగానే ఎప్పుడూ ఆహా అనిపించుకునే షోస్ తో అందరిని అలరిస్తుంది ఓటీటీ వేదిక ‘ఆహా’(Aha). ఈ తెలుగు ఓటీటీ డిజిటల్‌ సంస్థ విజయవంతంగా రన్‌ అవుతోంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోస్‌ నిర్మిస్తూ దూసుకుపోతుంది. అందులో భాగంగా టాక్‌ షోలు బాగా పాపులర్‌ అయ్యాయి. సమంత హోస్ట్ గా చేసిన `సామ్‌జామ్‌`, బాలకృష్ణ హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోలు విశేష ఆదరణ పొందాయి. అలాగే ప్రపంచంలోనే అదిపెద్ద సంగీత వేదికైన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ను తెలుగు లో ప్రవేశపెట్టింది. 

ఈ ఫిబ్రవరి 25 నుంచి Telugu Indan Idol సింగింగ్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. 32 ఏపిసోడ్స్ గా రన్ అవుతున్న ఈషో తాజాగా చివరి దశకు చేరుకుంది. ఈ షోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, అందాల హీరోయిన్ నిత్యామీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే షో లేటెస్ట్ ఎపిసోడ్ కు హాజరైన నందమూరి బాలక్రిష్ణ (Balakrishna) సింగర్స్ తో కలిసి సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు. 

గత వారం కంటెస్టెంట్స్ ‘రేస్ టు ఫినాలీ’ పరుగులో ఉన్నారు. సెమీ ఫైనల్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవి నిలిచారు. అయితే జూన్ 3న 15 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈషో చివరి ఘట్టంలోకి చేరుకుంటోంది. ఈ షోలో ఆడియెన్స్ కు నచ్చిన కంటెస్టెంట్స్ ని గెలిపించడానికి ఆహా చివరి అవకాశం కల్పిస్తోంది. జూన్ 3 నుండి జూన్ 6 ఉదయం 7 గంటల వరకు మీకు నచ్చిన పార్టిస్పెంట్ కు ఓటు వేసి, మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా నిలబెట్టే అవకాశాన్న అందిస్తోంది. జూన్ 3న ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉష ఉత్తుప్ (usha uthup) షోకు గెస్ట్ గా హాజరయ్యారు. కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ తో పాటు ఉష ఉత్తుప్ సంగీతంలో మైమరిచిపోవడానికి ఈ శుక్రవారం రాత్రి 9 గంటలకు (రేపు) సిద్ధంగా ఉండంటూ నిర్వహకులు పేర్కొన్నారు. ఉషా ఉత్తుప్ తెలుగులో ‘రేసు గుర్రం’లో టైటిల్ సాంగ్ పాడింది.

YouTube video player