Urvashi Rautela: సూపర్ స్టార్ రజనీ, ఎంఎస్ ధోని పేరు చెప్పి మాయ చేసిన హాట్ బాంబ్
గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 లాంటి చిత్రాలు, హద్దుల్లేని అందాల ఆరబోతతో ఊర్వశి రౌటేలా బాలీవుడ్ లో శృంగార త్వరగా ముద్ర వేయించుకుంది.
గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 లాంటి చిత్రాలు, హద్దుల్లేని అందాల ఆరబోతతో ఊర్వశి రౌటేలా బాలీవుడ్ లో శృంగార త్వరగా ముద్ర వేయించుకుంది. తరచుగా ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ ఫోజులు కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంటాయి.
హాట్ స్ట్రక్చర్ తో ఊర్వశి రౌటేలా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఊర్వశి రౌటేలా టాప్ లెస్ ఫోజుల్లో కూడా రెచ్చిపోవడం చూశాం. ఇదిలా ఉండగా ఊర్వశి రౌటేలా 'ది లెజెండ్' చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. జెడి జెర్రీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఊర్వశి రౌటేలా ఎల్లో పట్టు శారీలో మెరిసింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో వేడెక్కించే ఊర్వశి లెజెండ్ చిత్ర ట్రైలర్ లాంచ్ లో చీరకట్టుతో సర్ ప్రైజ్ చేసింది.
ఈ ఈవెంట్ లో ఊర్వశి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా కాలం నుంచి నాకు తమిళ చిత్రంలో నటించాలనే కోరిక ఉంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మొదటి రీజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సర్. రెండవ రీజన్ ఎంఎస్ ధోని, సీఎస్కే అని చెప్పింది.
దీనితో ఆడిటోరియం మోతెక్కిందనే చెప్పాలి. తమిళనాట రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులకు ఆయన ఆరాధ్య దైవం. ఇక ఐపీఎల్ మొదలయ్యాక ధోని కూడా తమిళ అభిమానులకు చేరువయ్యాడు.