కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉర్వశి చిరిగిన డ్రెస్ వైరల్ అయ్యింది. ఒక వృద్ధ మహిళను కాపాడటానికి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో డ్రెస్ చిరిగిపోయిందని ఉర్వశి చెప్పింది.
బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉర్వశి బ్లాక్ కలర్ గౌను ధరించి కాన్స్ లో మెరిశారు. అయితే ఆమె ధరించిన డ్రెస్ చిరిగిపోయింది. దీంతో ఉర్వశి ఫోటోలు వైరల్ అయ్యాయి, నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, తన డ్రెస్ ఎందుకు చిరిగిపోయిందో ఉర్వశివివరణ ఇచ్చింది. .
ఊర్వశి డ్రెస్ చిరిగిపోవడానికి కారణం ఇదే
డియర్ ఫ్యాన్స్, నేను మీతో ఒక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈవెంట్‌కి వెళ్తున్నప్పుడు, మా కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. 70 ఏళ్ల వృద్ధ మహిళ కారుకి అడ్డంగా వచ్చారు. ఆమెను కాపాడటానికి మా డ్రైవర్ బ్రేకులు వేశాడు. దీంతో నా గౌను చిరిగిపోయింది. కానీ ఆ సమయంలో నాకు ఎలాంటి గాయం కాలేదు. ఆ మహిళతో పాటు నేను కూడా సురక్షితంగా ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఆ రోజు రెడ్ కార్పెట్ పై అదే డ్రెస్ లో కనిపించడం మరచిపోలేని అనుభూతి అని ఊర్వశి పేర్కొంది.
ట్రోలర్స్‌కి ఉర్వశి సమాధానం
నన్ను చూసి నవ్వుకుంటున్న వారిని చూసి నేను కూడా నవ్వుతున్నా. అందం బట్టల్లో కాదు, కష్ట సమయాల్లో మనం తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది అంటూ ఊర్వశి పేర్కొంది. చిరిగిన డ్రెస్ వేసుకున్నందుకు ఉర్వశిని చాలా మంది ట్రోల్ చేశారు. ఉర్వశి అదృష్టం బాగోలేదని కొందరు అన్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో చిరిగిన బట్టలు వేసుకున్న మొదటి భారతీయ నటి ఉర్వశే అని మరికొందరు అన్నారు. చాలా మంది ఉర్వశిని ఎగతాళి చేశారు. కొందరు మాత్రం ఆమెకి మద్దతు తెలుపుతున్నారు.