ఈ ట్రైలర్ ని ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసారు.  ‘‘ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌’’ అని తారక్‌ అన్నారు. ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అనే డైలాగు బాగుంది. అలాగే విజయ్ సేతుపతి షాట్స్ ,డైలాగులు కూడా బాగున్నాయి. పేద,ధనిక మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. సినిమాని నిలబెట్టే అంశంమేదో దాచినట్లున్నారు. దాన్ని రివీల్ చేయలేదు.  మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

 మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.