మెగాస్టార్‌ మేనల్లుడు వైష్టవ్‌ తేజ్‌ తొలి చిత్రం ఉప్పెనా ఏప్రిల్ 5 న తెరపైకి రావాల్సి ఉంది, అయితే కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ అమలు కారణంగా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలన్నీ ఎక్కువ శాతం ఓటీటీ వేదికనే నమ్ముకున్నాయి. అయితే థియేటర్లలోనే విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాని ఓటీటీకి అమ్మ లేదు. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రీసెంట్ గా ఉప్పెన చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. సినిమాపై ఉన్న నమ్మకంతో భారీ ధర పెట్టి  హక్కులు తీసుక్కున్నట్లు తెలుస్తుంది. 

అయితే ఓ కండీషన్ తోనే ఈ రైట్స్ ని అమ్మారట. అదేమిటంటే...ఈ సినిమా ని నెట్ ప్లిక్స్ లో రిలీజ్ రోజే థియోటర్ లోనూ రిలీజ్ చేస్తారు. ఈ మధ్యనే హాలీవుడ్ నిర్మాణ సంస్ద వార్నర్ బ్రదర్శ్ వారు...తమ దగ్గర ఉన్న 17 సినిమాలను అటు థియోటర్, ఇటు ఓటీటిలలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇదే పద్దతిని ఉప్పెన ఫాలో అవుతోందిట. ఈ మార్కెట్ ఎక్సపరిమెంట్ కనుక సక్సెస్ అయితే మరన్ని సినిమాలు ఇదే దారిలో ప్రయాణం పెట్టుకుంటాయనటంలో సందేహం లేదు. 
 
ఇక ఉప్పెనను ముందుగా అమెజాన్ ప్రైమ్ రైట్స్ కొనుక్కోవడానికి ముందుకు వచ్చిందట. కానీ నెట్ ఫ్లిక్స్ భారీగా వెచ్చించి మరీ హక్కులు కొనుక్కుందట.   మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.