`ఉప్పెన` చిత్రం ఏకంగా వంద కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసిందని అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌నే షేక్‌ చేసింది. కరోనా తర్వాత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది.  ఇంతటి విజయానికి కారణం దర్శకుడు బుచ్చిబాబు. ఆయన్ని చిత్ర బృందం గౌరవించింది. భారీ గిఫ్ట్ ఇచ్చింది.

`ఉప్పెన` సినిమాతో సంచలన విజయాన్ని అందించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓ డెబ్యూ టీమ్‌ నుంచి వచ్చిన సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్‌ సాధించడం టాలీవుడ్‌ చరిత్రలోనే ఫస్ట్ టైమ్‌. ఇది ఏకంగా వంద కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసిందని అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌నే షేక్‌ చేసింది. కరోనా తర్వాత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. 

ఇంతటి విజయానికి కారణం దర్శకుడు బుచ్చిబాబు. ఆయన్ని చిత్ర బృందం గౌరవించింది. భారీ గిఫ్ట్ ఇచ్చింది. నిర్మాతలైన సుకుమార్‌, వై రవిశంకర్‌,నవీన్‌ ఎర్నేని ఏకంగా బెంజ్‌ కారుని బహుమతిగా అందించారు. బెంజ్‌ జీఎల్‌సీ కారును గిఫ్ట్‌ఇచ్చారు. దీంతో బుచ్చిబాబు ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ చిత్ర హీరో వైష్ణవ్‌ తేజ్‌కి కోటీ రూపాయల పారితోషికం, అలాగే హీరోయిన్‌ కృతి శెట్టికి రూ.25లక్షలు అందించారు. ఇప్పుడు దర్శకుడుకి రూ.75లక్షల విలువ చేసే బెంజ్‌ కారుని గిఫ్ట్ ఇచ్చారు. కారులో బుచ్చిబాబు సానా, సుకుమార్‌ కూర్చొని వెనకాల చూడటం ఆకట్టుకుంటుంది. బుచ్చిబాబు సుకుమార్‌ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. 

Scroll to load tweet…