Asianet News TeluguAsianet News Telugu

''ఉప్పెన'' 100 కోట్ల పోస్టర్ పడింది,ఇక మూసుకుంటారా?

 మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ''ఉప్పెన''. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని రూపొందించిన ఈ చిత్రం పిబ్రవరి 12 న రిలీజైంది. మార్నింగ్ షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతోంది. ఊహకు అందని క్లైమాక్స్ తో పాటు, హీరోహీరోయిన్ల నటన - విజయ్ సేతుపతి సెటిల్డ్ ఫెరఫార్మెన్స్,  దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ తెలుపుతూ మొదటి నుంచి పోస్టర్స్ వేస్తూ వస్తున్నారు నిర్మాతలు.

Uppena Movie Uppena movie cross 100 crore gross jsp
Author
Hyderabad, First Published Mar 7, 2021, 7:26 AM IST


 మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ''ఉప్పెన''. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని రూపొందించిన ఈ చిత్రం పిబ్రవరి 12 న రిలీజైంది. మార్నింగ్ షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతోంది. ఊహకు అందని క్లైమాక్స్ తో పాటు, హీరోహీరోయిన్ల నటన - విజయ్ సేతుపతి సెటిల్డ్ ఫెరఫార్మెన్స్,  దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ తెలుపుతూ మొదటి నుంచి పోస్టర్స్ వేస్తూ వస్తున్నారు నిర్మాతలు.

తొలి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత  ఫస్ట్ వీక్ లోనే 70 కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ కొత్త హీరోకు ఈ స్దాయి కలెక్షన్స్ రావటం ఎవరూ ఊహించని విషయం. దాంతో  ఇది ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దాంతో వద కోట్ల పోస్టర్ వేస్తారా ,వేయరా అనే డైలమో ఏర్పడింది. 

ఓ ప్రక్కన సుకుమార్..స్టేజిపై వంద కోట్ల వసూలు చేస్తుందని అన్నారు. మరి ఇప్పుడు వంద కోట్లు పోస్టర్ వేసి ఆయన మాటని నిజం చేస్తే ..ఫేక్ కలెక్షన్స్ అంటున్న వారు మరింతగా హంగామా చేస్తారనే ఆలోచనలో మేకర్స్ పడ్డారని ప్రచారం జరిగింది. అయితే అంత సీన్ లేదని..వంద కోట్ల పోస్టర్ ని వదిలారు నిర్మాతలు. 

100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందటూ..'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.'ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios