మెగా ఫ్యామిలీ  వస్తున్న మెగా బ్రదర్స్‌ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా పరిచయం అవటానికి  ఉప్పెనతో సిద్దంగా ఉన్నాడు. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉప్పెన సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయన్నది మాత్రం నిజం.ఎక్సపెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బుచ్చి బాబు ఈ సినిమాను తెరకెక్కించాడని టీజర్, ట్రైలర్స్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా లోని పాటలు హిట్ అవ్వడంతో పాటు   భారీ ఎత్తున పబ్లిసిటీ ఏక్టవిటీస్ కూడా ఈ సినిమాకు  మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది.

 ఏరియాల వారిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌
నైజాం: రూ.6 కోట్లు
సీడెడ్‌:రూ.3 కోట్లు
ఆంధ్రా: రూ.10 కోట్లు
ఓవర్సీస్‌ : రూ.1.5 కోట్లు
మొత్తం : రూ. 20.5 కోట్లు

ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే దాదాపుగా రూ.22 కోట్లు వసూళ్లు సాధించాల్సి ఉంది. సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో మొదటి వారం రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం అవుతుంది అంటూ నమ్మకంగా చెబుతున్నారు. 

 మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌజ్ బ్యాక్ చేయడం.. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుండటంతో ఉప్పెనపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అందరికీ షాక్ ఇస్తున్నాయి. 2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉప్పెనదే హైయ్యస్ట్. క్రాక్ సినిమా బిజినెస్ కూడా క్రాస్ చేసింది ఉప్పెన. ఫిబ్రవరి 12న వాలెంటైన్ డే వీకెండ్ కానుకగా విడుదల కానుంది ఉప్పెన. 

మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ నటించారు. “జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.. సెల సెల సెల‌యేరుని నేను” అంటూ సాగే ఈ పాట‌ను చిత్రంలో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టిపై డ్యూయెట్‌గా చిత్రీక‌రించారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన సుమ‌ధుర బాణీల‌కు త‌గ్గ‌ట్లు అంద‌మైన ప‌దాల‌తో పాట‌ను అల్లారు గేయ‌ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి. జ‌స్‌ప్రీత్ జాజ్‌, శ్రేయా ఘోష‌ల్ గాత్రంలో ఈ మెలోడీ సాంగ్‌ మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నేట్లు ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

త‌న మ్యూజిక్ టేస్ట్‌తో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను అందిస్తున్నారు.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఓ ప్ర‌ధాన‌ పాత్ర చేస్తున్న ‘ఉప్పెనలో సాయిచంద్, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ధారులు

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.