‘లాక్‌డౌన్‌ తర్వాత ఇతర రాష్ర్టాలు, భాషల వారు సినిమాల్ని విడుదల చేయడానికి భయపడుతున్నారు.  తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో  నిర్మాతలు ధైర్యంగా ఈ సినిమాను విడుదలచేశారు. ‘ఉప్పెన’ను విజయవంతం చేసి తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణంపోశారు. ఇతర భాషల వారిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారు

 మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ''ఉప్పెన''. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని రూపొందించిన ఈ చిత్రం రెండు వారాల క్రితం రిలీజైంది. మార్నింగ్ షో నుంచే అదిరిపోయే టాక్ తో దూసుకుపోతోంది. ఊహకు అందని క్లైమాక్స్ తో పాటు, హీరోహీరోయిన్ల నటన - విజయ్ సేతుపతి సెటిల్డ్ ఫెరఫార్మెన్స్,  దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. 

ఈ నేపధ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ గురించి చెప్తూ నిర్మాతలు తొలి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత  ఫస్ట్ వీక్ లోనే 70 కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ కొత్త హీరోకు ఈ స్దాయి కలెక్షన్స్ రావటం ఎవరూ ఊహించని విషయం. దాంతో  ఇది ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అలాగే ఏకంగా వారం రోజుల్లో రూ. 70 కోట్ల గ్రాస్ అన్నారు. అంటే షేర్ రూ. 45 కోట్లకు పైగానే రావాలి కదా.. మరి ఎందుకు రూ. 38 కోట్లు చూపిస్తున్నారు అంటూ కొందరు డైరక్ట్ గా ప్రశ్నిస్తున్నారు.

 దాంతో ఈ వారం 100 కోట్ల పోస్టర్ వేద్దామనుకున్న టీమ్  డైలమోలో పడిందిట. ఓ ప్రక్కన సుకుమార్..వంద కోట్ల వసూలు చేస్తుందని అన్నారు. మరి ఇప్పుడు వంద కోట్లు పోస్టర్ వేసి ఆయన మాటని నిజం చేస్తే ..ఫేక్ కలెక్షన్స్ అంటున్న వారు మరింతగా హంగామా చేస్తారనే ఆలోచనలో మేకర్స్ పడ్డారని అంటున్నారు.