ఒక కాంబినేషన్ హిట్ అయ్యిందంటే దాన్ని రిపీట్ చేయటానికి సినీ జనాలు ఉత్సాహపడుతూంటారు. ఎందుకంటే బిజినెస్ యాంగిల్ లో రిపీట్ కాంబోకు ఉండే క్రేజు వేరు.కానీ సినిమా హిట్టయ్యాక డైరక్టర్, హీరో ఇద్దరూ బిజీ అయ్యిపోతూంటారు. దాంతో అదే కాంబినేషన్ రిపీట్ అవటానికి చాలా టైమ్ తీసుకుంటుంది. కానీ రీసెంట్ గానే ఘన విజయం సాధించిన ‘ఉప్పెన’ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని వినికిడి.వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న ఉప్పెన టీమ్ మళ్లీ ఒకటి అవుతోందంటే మరో మిరాకిల్ జరుగుతుందని భావిస్తున్నారు.

ఇక ఈ ఉప్పెన లో బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటీ అంటే ఖచ్చితంగా హీరో వైష్ణవ్‌ తేజ్ మరియు హీరోయిన్‌ కృతిశెట్టిల మద్య ఉన్న రొమాన్స్,క్లైమాక్స్ సీన్ అని చెప్తారు. యూత్ కు బాగా ఈ రొమాన్స్ ఎక్కేసిందనడంలో సందేహం లేదు. దాంతో  వీరిద్దరి కాంబోలో మరో సినిమా చేస్తే బాగుంటుందని నిర్మాతకు ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే ఇద్దరితో మాట్లాడి  కన్ఫర్మ్‌ చేసేసినట్లు విశ్వసనీయ సమాచారం.  నిర్మాతలు కూడా మరెవరో కాదు మైత్రి మూవీస్ వారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై బుచ్చిబాబు సన వర్క్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నారు. ఉప్పెన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న బుచ్చి బాబు ఈ సారి ఓ క్రేజీ పాయింట్ తో రాబోతున్నారని అంటున్నారు. ఆ పాయింట్ విన్న నిర్మాతలు మళ్లీ వేరే జంటతో లవ్ స్టోరీ ఎందుకు..వీరితోనే చేసేద్దామని ఒప్పించారని తెలుస్తోంది. దాంతో  మళ్లీ మైత్రి మూవీస్ లోనే వైష్ణవ్‌ మరియు కృతిలతోనే సినిమాను బుచ్చిబాబు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే బుచ్చిబాబు రెండవ సినిమా మరో ఉప్పెన అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్‌ త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వైష్ణవ్‌ తేజ్‌ 4వ సినిమాగా ఇది రూపొందబోతుందని చెప్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పట్టాలపైకి వచ్చి, ద్వితీయార్దంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.