కెరీర్ ప్రారంభం నుంచీ డిఫరెంట్  సినిమాలు చేసి ప్రేక్షధారణ పొందిన హీరో ఉపేంద్ర.. అయన సినిమా అంటే తెలుగులోనూ ఒకప్పుడు ఓ రేంజిలో క్రేజ్ ఉండేది. ఇక్కడ ఆయనకు ఫ్యాన్స్ అశోశియేషన్స్ ఉండేవి.  `ఏ` నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన `ఐ ల‌వ్ యు` చిత్రాల వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల‌న్నీ వెరైటీ క‌థ‌ల‌తో కొత్త పంథాలో సాగే ట్రెండీ చిత్రాలే. ఓ టైమ్ లో తెలుగు నిర్మాతలు, దర్శకులు కూడా ఉపేంద్ర కోసం కథలు చేసి,తెరకెక్కించటానికి ఉత్సాహం చూపించేవారు. అయితే కాలక్రమేణా పూర్తిగా కన్నడ పరిశ్రమకే ఉపేంద్ర పరిమితం అవటం, తెలుగులో ఆయన సినిమాలకు డిమాండ్ తగ్గటం జరిగింది. 

అయితే ఉపేంద్ర హీరోగా కాకుండా టాలీవుడ్ లోకి క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎంట్రీ ఇచ్చారు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఓ విభిన్నమైన పాత్ర చేసారు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా ఉపేంద్ర ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడాయన ఓ పెద్ద సినిమా సైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. కేవలం కన్నడ మార్కెట్ కోసం కాకుండా ఉపేంద్ర వంటి స్టార్ ..విలన్ గా చేస్తే సినిమాకు ఖచ్చితంగా మంచి లుక్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆ సినిమా మహేష్,పరుశరామ్ దర్శకత్వంలో రూపొందే సినిమా అంటున్నారు. ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.
 
ఇదిలా ఉంటే...ఉపేంద్ర తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక‌కాలంలో చేస్తున్న చిత్రం `క‌బ్జా`. ఆర్‌. చంద్రు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌సిద్ధేశ్వ‌ర ఎంట‌క్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ల‌గ‌డ‌పాటిశ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని ఆర్ . చంద్ర‌శేఖ‌ర్‌, రాజ్‌ ప్ర‌భాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1947-80 ల మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఓ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

టెక్నిక‌ల్‌గానూ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఇందులో ఉపేంద్ర పాత్ర చిత్ర‌ణ వుంటుంద‌ని, పాన్ ఇండియా లెవెల్లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవాల‌న్న క‌సితో ఈ చిత్రాన్ని చేస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు చెబుతున్నారు.

త‌ను న‌టించిన `ఏ` చిత్రం నుంచి ఇటీవ‌ల చేసిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వ‌ర‌కు తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ని ఆద‌రించార‌ని, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నాం. గ‌తంలో వ‌చ్చిన `ఓం` చిత్రాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించాం. అదే త‌ర‌హాలో ఈ చిత్రాన్ని కూడా కొత్త జూన‌ర్‌లో ఊపొందిస్తున్నాం. పాన్ ఇండియా చిత్రంగా అల‌రించాల‌ని చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేస్తున్న చిత్ర‌మిద‌ని హీరో ఉపేంద్ర మీడియాకు వెల్లడించారు.