డిఫరెంట్ సినిమాలతో సౌత్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో ప్రయోగాత్మకమైన సినిమాతో రాబోతున్నాడు. ఐ లవ్ యు అనే సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన ఉపేంద్ర ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. సినిమాలో ప్రేమకు సంబందించిన కౌంటర్లు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

రోమియో - డ్యూలియెట్. లైలా - మజ్ను.. అనవసరంగా రెండు నిమిషాల ప్రేమ కోసం చనిపోయారని వారు బ్రతికుంటే 100 కేసులు పెట్టేవాన్ని అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగ్ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రొమాన్స్ డోస్ కూడా సినిమాలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే ఉపేంద్ర డిఫరెంట్ షేడ్స్ తో హైలెట్ అవుతున్నాడు. 

చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లోనే ఉపేంద్రకు ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని ఇస్తుందో చూడాలి.