టాలీవుడ్ యంగ్ స్టార్స్ గురించి ఇతర ఇండస్ట్రీల నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బన్నీపై చేసిన పాజిటీవ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  

టాలీవుడ్ యంగ్ స్టార్స్ గురించి ఇతర ఇండస్ట్రీల నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బన్నీపై చేసిన పాజిటీవ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ లో హీరోగా స్పెషల్ ఇమేజ్ తో ఒకప్పుడు దూసుకుపోయాడు ఉపేంద్ర. తెలుగు హీరోనే అన్నట్టుగా తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు ఉపేంద్ర. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు.తాను హీరోగా చేసిన టాలీవుడ్ లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రను పోషించిన ఆయన, చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా వరుణ్ తేజ్ తో కలిసి గని సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. 

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో ఉంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈసినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఈసినిమాకు సంబంధించిన తాజా ఇంటర్వ్యూ లో ఉపేంద్ర మాట్లాడారు. గని సినిమాతో పాటు తను గతంలో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఉపేంద్ర.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేసేటప్పుడు సెట్లో బన్నీ ఎంతో సరదాగా ఉండేవారన్నాడు ఉపేంద్ర. అంతే కాదు తనను ఎంతో మర్యాదగా చూసుకునేవాడట. ఉపేంద్రకు ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసుకుని తెప్పించేవారు. ఆ సినిమా పూర్తయ్యే వరకూ నన్ను ఆయన ఒక గిఫ్టులా చూసుకున్నారు. ఆ రోజులను నేను ఇప్పటికీ మరిచిపోలేదు అంటూ ఎంతో సంతోషంతో చెప్పాడు ఉపేంద్ర.

అంతే కాదు ఉపేంద్ర మాట్లాడుతూ.. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు. ఒకసారి నేను బన్నీని అడిగాను మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఏది అని. ఖరీదైన కార్లా..? ఫారెన్ టూర్లా..? అని అడిగాను. దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. నాకు అసలు దేనిపై పెద్దగా ఇష్టం ఉండదు. సినిమాలా నాకు మరేదీ సంతోషాన్ని కలిగించదు. షూటింగు ఉంటే నాకు ఆ రోజు పండగ రోజులా ఉంటుంది అన్నారు.. అంటూ ఉపేంద్ర చెప్పుకొచంచారు. 

అంతే కాదు బన్ని ఇచ్చిన ఆ సమాధానానికి ఉపేంద్ర ఫిదా అయ్యారు ఉపేంద్ర. అంతే కాదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారు ఆయనను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది అని అన్నారు. ముందు ముందు అవకాశాలు వస్తే.. తెలుగు సినిమాల్లోస్పెషల్ క్యారెక్టర్స్ కు సై అంటున్నారు ఉపేంద్ర.