Asianet News TeluguAsianet News Telugu

మీ ఇద్దరిలో 'తెలంగాణ దేవుడు' ఎవరు? ఈ కన్ఫూజన్ ఏంటి ?

ఇప్పుడు  `తెలంగాణ దేవుడు`   ఎవరు అనే విషయంపై క్లారిఫికేషన్ కావాల్సివచ్చింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ హీరోగా ఈ టైటిల్ తో ఓ సినిమా ప్రారంభమై పోస్టర్స్ కూడా వదిలారు.  

update on telangana devudu movie
Author
Hyderabad, First Published Oct 30, 2018, 10:58 AM IST

ఇప్పుడు  'తెలంగాణ దేవుడు'   ఎవరు అనే విషయంపై క్లారిఫికేషన్ కావాల్సివచ్చింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ హీరోగా ఈ టైటిల్ తో ఓ సినిమా ప్రారంభమై పోస్టర్స్ కూడా వదిలారు.  'తెలంగాణ దేవుడు' టైటిల్ తో కేసీఆర్ బయోపిక్ తీస్తున్నామని ఆ టీమ్ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా పోసాని సీన్ లోకి వచ్చారు. పోసాని ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్రారంభైంది. దాంతో అసలు ఎవరు  'తెలంగాణ దేవుడు' టైటిల్ తో థియోటర్స్ లోకి దిగేది అనే కన్ఫూజన్ తయారైంది. 

శ్రీకాంత్ హీరోగా రెడీ అవుతున్న సినిమా విషయానికి వస్తే... కేసీఆర్ ..ఒక నైతిక విలువ‌లున్న మ‌నిషి గొప్ప ఐడియాల‌జీతో ప్ర‌జ‌ల కోసం ఎలా ఎదిగాడు? అన్న‌ది ఈ చిత్రంలో చూపించ‌నున్నామని ఆన్నారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా  శ్రీ‌కాంత్  కనిపించనున్నారు. శ్రీకాంత్ కు మొదటి నుంచీ తెలంగాణ‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌తియేటా  ఆయన బర్త్‌డే రోజు హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్‌లోని ఇంటికి వ‌చ్చి మ‌రీ తెలంగాణా ఫ్యాన్స్ స‌త్కారం చేసి వెళుతుంటారు.  శ్రీ‌కాంత్ పేరుతో క్యాలెండ‌ర్లు సైతం ముద్రించి పంచారు తెలంగాణ అభిమానులు.దాంతో తెలంగాణాలో శ్రీకాంత్ సినిమా అంటే మంచి ఓపినింగ్స్ ఉంటాయని, కేసీఆర్ దృష్టిలో పడినట్లు ఉంటుందని ఈ సినిమా మొదలెట్టారు. 

ఇక ఇదే టైటిల్ తో వస్తున్న పోసాని సినిమా విషయానికి వస్తే.. జిషాన్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, అలీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'తెలంగాణ దేవుడు'. హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వం వహిస్తున్నారు. మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. సుమన్‌, నామాల మూర్తి, కేదార్‌ శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: ఎ.విజయ్‌కుమార్‌, కళ: హరిబాబు.

Follow Us:
Download App:
  • android
  • ios