ప్రభాస్,నాగ్ అశ్విన్ ఫిల్మ్ లేటెస్ట్ అప్డేట్

నాగ అశ్విన్‌కు ప్రభాస్‌ అభిమానులు ఈ విషయమై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

update on Prabhas-Nag Ashwin film jsp

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో మొదట రాధే శ్యామ్ సినిమా ని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఆదిపురుష్, సలార్ లైన్ లో పెట్టారు. అయితే ఈ మధ్యలోనే మరొకటి ఫినిష్ చేసేసేటట్లు ఉన్నారు. అది మరేదో కాదు... ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం. ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రకటన చేసి చాలా రోజులవుతున్నప్పటికీ అప్‌డేట్‌ మాత్రం రావటం లేదు. దీంతో నాగ అశ్విన్‌కు ప్రభాస్‌ అభిమానులు ఈ విషయమై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూలైలో షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు నాగ్‌ అశ్విన్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.  అయితే కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సూపర్‌ హీరో పాత్ర చేయనున్నారనే వినిపిస్తోంది. అందుకే  ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ కోసం నాగ్‌ అశ్విన్‌ చాలా టైమ్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు‌. మరో ప్రక్క ఈ సినిమాకు చెందిన భారీ సెట్‌ వర్క్స్‌ కూడా జరుగుతున్నాయని వినికిడి. దీపికా పదుకోని హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర  చేయనున్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...ప్రభాస్‌తో నేను చేయబోయే సినిమాలో కూడా కొంత హ్యూమర్‌ ఉంటుంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అందుకే సమయం పడుతోంది. త్వరలో ఫస్ట్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తున్నాం. ప్రభాస్‌ దగ్గరకి ఒక పెద్ద స్టార్‌గా భావించి వెళతాం. కానీ ఆయన సరదాగా ఉంటారు. సినీ లెక్కలు, బాక్సాసీఫ్‌ ఓపెనింగ్స్‌ పట్టించుకోరు. సోషల్‌ మీడియాపై ఆసక్తి చూపించరు. ఎప్పుడైనా మాట్లాడితే మేం చేయాల్సిన సినిమాలు, ఆయన చేస్తున్న ఇతర సినిమాల గురించే మాట్లాడతారు అని చెప్పుకొచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios