బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు రమేష్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.

ఇటీవల సినిమా టీజర్ కూడా వచ్చింది. సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఎక్కువరోజులు కాకుండానే అప్పుడే షూటింగ్ పూర్తి కావొస్తుండడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  అసలు మేటరేంటంటే..? ఈ సినిమాలో సగానికి పైగా సీన్లను ఒరిజినల్ సినిమా నుండి కాపీ చేశారట.

టీజర్ లో కనిపించిన కొన్ని షాట్స్ ఒరిజినల్ సినిమా నుండి తీసుకున్నవే.. 'రాచ్చసన్' సినిమాలో నటించిన కొందరు నటీనటులను రీమేక్ లో కూడా తీసుకున్నారు. వాళ్లతో చేయాల్సిన సన్నివేశాలను ఒరిజినల్ సినిమా నుండి తీసుకున్నారట. బెల్లంకొండ అలానే మరికొందరు ఆర్టిస్ట్ లు ఉన్న సీన్లు మాత్రం కొత్తగా తీశారట.

రీమేక్ సినిమా అంటే ఇలా కాపీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సినిమా కోసం దర్శకుడు కాస్త ఎక్కువగానే కాపీ చేశాడట. ఇలా చేయడం వలన ఖర్చు తగ్గడంతో పాటు, టైం కూడా కలిసొస్తుందని భావించారు. మరి ఈ ఐడియా వర్కవుట్ అయి సినిమా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి!