Asianet News TeluguAsianet News Telugu

రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘రావణసుర’ నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది? ఎప్పుడంటే?

మాస్ మహారాజ రవితేజ (RaviTeja) లైనప్ లో రిలీజ్ కు సిద్దమవుతున్న చిత్రం ‘రావణసుర’. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ అందింది. చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

update from RaviTejas Ravanasura movie?
Author
First Published Jan 24, 2023, 1:39 PM IST

గతేడాది వరుస చిత్రాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన మాస్ మహారాజా..  ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’లో కామియో అపియరెన్స్ తో దుమ్ములేపారు. ఇక చివరిగా విడుదలైన ‘ధమాకా’ చిత్రం కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం మాస్ మహారాజా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ అందిస్తూనే ఉన్నారు. ఇక రవితేజ లైనప్ లో రిలీజ్ కు సిద్దమవుతున్న మరో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ (Ravanasura). గతేడాది ప్రారంభమైన చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

అయితే, ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అందింది. మరో నాలుగు రోజుల్లో రవితేజ పుట్టిన రోజు ఉండటంతో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘రావణసుర’ నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల కానుందంట. జనవరి 26న మాస్ రాజా బర్త్ డే స్పెషల్ గా ఈ అప్డేట్ అందనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటి నుంచి ఈ మూవీ అప్డేట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అందనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ధమాకా’తో  ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా ‘రావణసుర’ అప్డేట్స్ మరింత జోష్ ను నింపేలా కనిపిస్తున్నాయి.

‘స్వామి రారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ, అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నాడ ఆయా పాత్రల్లో మెరియనున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7న విడుదల కానుంది. అదేవిధంగా ‘టైగర్ నాగేశ్వర్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మరో చిత్రం కూడా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios