ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో అడివి శేష్ ‘మేజర్’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ అందింది. మోస్ట్ అవెయిటెడ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
అడవి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన చిత్రం `మేజర్` (Major). శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయీ మజ్రేఖర్, శోభితా దూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటన ఆధారంగా, ఆ ఘటనలో పోరాడిన ఇండియన్ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
గతంలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లోని విజువల్స్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఆ తర్వాత మేజర్ నుంచి పెద్ద ఎలాంటి అప్డేట్ అందలేదు. దీంతో ఆడియెన్స్ కొంత నిరాశ చెందారు. మరోవైపు అన్ని చిత్రాలు రిలీజ్ అవుతుండగా అభిమానులు మేజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ట్రైలర్ అయినా రిలీజ్ చేస్తారేమోనని ఆశపడ్డారు. ఇందుకు తగ్గట్టుగానే తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు.
మేజర్ మూవీ నుంచి హీట్ పుట్టించే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మే 9న ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. జూన్ 3న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
కోవిడ్ -19 పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. గతేడాది జులై 2నే మేజర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఈ చిత్రాన్ని 75 లోకేషన్లలో 120 రోజుల్లోనే పూర్తి చేసి ఎట్టకేళలకు రిలీజ్ కు సిద్ధం చేశారు. ఈ చిత్రంలో తెలుగు, హిందీ భాషలో రూపొందుతుండగా.. మలయాళంలో డబ్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అడివి శేష్ మేజర్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ : ది సెకండ్ కేస్’లోనూ నటిస్తున్నారు.
