రంగస్థలం హిట్ అయ్యింది.. మొక్కు తీర్చుకుంది

First Published 13, Apr 2018, 12:01 PM IST
Upasana went by walk to thirumala
Highlights
రంగస్థలం హిట్ అయ్యింది.. మొక్కు తీర్చుకుంది

మన సాంప్రదాయం ప్రకారం చూస్తే మనకు ఏదైన కోరికలు ఉంటే దేవుడికి తలనీలాలు ఇవ్వడాలు, లేకపోతే తిరుమల కొండ ఎక్కడం లాంటివి సాధారణ భక్తులు చేసే పని. ఈ పనులు సామాన్యుడికే కాదండోయ్ సినీ ప్రముకులకు కూడా అతీతం కాదు. ఇప్పుడు ఉపాసన ముక్కుబడి తీర్చుకుంటున్న పిక్ ఒకటి వైరల్ అవుతోంది.

రంగస్థలం సినిమా రీలీజ్ కాకముందు ముక్కుకుందో.. లేక సక్సెస్ సాధించిన తర్వాత ముక్కుకుందో తెలీదు కానీ.. ఉపాసన మాత్రం ఇప్పుడు తిరుమల వెంకటేశునికి మొక్కు తీర్చుకుంటోంది. ఏడు కొండలు ఎక్కి మరీ వెంకటేశుని దర్శనానికి వెళ్లింది. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఉపాసన. తిరుమల మెట్లను ఓ ఫోటో తీసి పోస్ట్ చేసిన ఉపాసన.. రామ్ చరణ్.. రంగస్థలం అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టడం ద్వారా.. తన భర్త సాధించిన అద్భుత విజయం కోసమే ఈ ఏడు కొండలు ఎక్కే ప్రోగ్రామ్ ను పెట్టుకున్నట్లు నేరుగానే చెప్పింది ఉపాసన.

ఇక రంగస్థలం మూవీ సక్సెస్ చెర్రీ ఫ్యామిలీ సభ్యులు ఫ్యాన్స్ అందరు క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ జరగనుండగా.. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా అటెండ్ కానున్నాడు. 

loader