టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఆదివారం జైపూర్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల లో ఆశ్రిత తన ప్రేమించిన వినాయక్ ని పెళ్ళాడింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'వెంకీ అంకుల్, నీరు ఆంటీ.. ఆశ్రిత, వినాయక్ కి అభినందనలు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. రానా దగ్గుబాటి, మిస్టర్ సి జైపూర్ లో ఇద్దరూ సూపర్ డేజావూ' అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది.

హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడే వినాయక్ రెడ్డి. కొంతకాలం పాటు వినాయక్, ఆశ్రితలు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లి వేడుక జరిపించారు. దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసంత్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.