మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మంచి ఇల్లాలిగానే కాకుండా అటు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ నేటి తరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఆమె కేటీఆర్ కి ట్వీట్ చేశారు. తెలంగాణకు సంబందించిన కొత్త ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతూ జాబ్ ఎలా ఉంది సార్ అని పేర్కొన్నారు. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశం కోసం ఉపాసన దావోస్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఆమె ఫోరంలోని తెలంగాణ డెస్క్‌కు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలకు అవసరం అయ్యే సమాచారం అందించినట్లు చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడ కూర్చున్నా అని చెబుతూ తన జాబ్ ఎలా ఉందొ చెప్పాలని ఐటి మంత్రి కేటీఆర్ గారికి ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

అందుకు సంబందించిన పోటోలను కూడా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మైక్రోసాఫ్ట్ తో అత్యాధునిక హెల్త్‌కేర్‌ వ్యవస్థలను స్టార్ట్ చేయడానికి సదరు సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు కూడా ఉపాసన వివరిస్తూ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లను కలిసినట్లు చెపుతూ నాదెళ్లతో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.