Asianet News TeluguAsianet News Telugu

Upasana : వివాదంలో మెగా కోడలు ఉపాసన, మనోభావాలు దెబ్బతీసిందంటూ.. నెటిజన్ల ఆగ్రహం..

ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటుంటారు మెగా కోడలు ఉపాసన (Upasana). అందరి ప్రశంసలు పొందుతూ ఉండే ఈ సెలబ్రిటీ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో వివాదంలో చిక్కుకున్నారు.

Upasana Social Media Viral Post
Author
Hyderabad, First Published Jan 27, 2022, 11:05 AM IST

ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటుంటారు మెగా కోడలు ఉపాసన (Upasana). అందరి ప్రశంసలు పొందుతూ ఉండే ఈ సెలబ్రిటీ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో వివాదంలో చిక్కుకున్నారు.

మెగా కోడలు... రామ్ చ‌ర‌ణ్(Ram Charan) స‌తీమ‌ణి ఉపాస‌న(Upasana) ఎప్పుడూ ఏదో ఒక మంచి కార్య‌క్ర‌మం చేస్తూనే ఉంటారు. జనాలకోసం మంచి చేయడంతో పాటు.. సోషల్ మీడియాలో సందర్భానుసారు మంచి చెడుల గురించి స్పందిస్తూ ఉంటారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉపాసన పెట్టే పోస్టులు అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంటాయి. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉంటారు.నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటూ ఉండే ఉపాసన(Upasana) అదే నెటిజన్ల ఆగ్రహానికి గురిఅయ్యారు.

తాజాగా ఈమె సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు కొంద‌రి ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ఇప్పుడు ఇదే పోస్ట్ భారీ వివాదానికి దారి తీస్తుంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌లు శుభాకాంక్ష‌లు తెలిపిన ఉపాస‌న(Upasana) ఓ ఆల‌యం ఫొటోను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ ఆల‌య గోపురంలో మాత్రం దేవతా విగ్రహులు ఉండాల్సిన ప్లేస్ లో రకరకాల జనాల పిక్స్ మైక్రో ఫోటోస్ రూపంలో ఉన్నాయి. అయితే ఈఫోటోన్ పోస్ట్ చేసిన ఉపాసన(Upasana) సరదాగా వారందరి మధ్యలో తాను, త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నామ‌ని.. తాము ఆ ఫొటోలో ఎక్క‌డ ఉన్నామో క‌నుక్కోవాలంటూ.. ఫజిల్ విసిరింది.

 

అయితే ఎవరో ఎడిట్ చేసిన ఈ ఫోటోను... తాను పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ ఆలయం పైన దేవతా విగ్రహాలకు బదులు ఇలా మనషులతో చేర్చి ఎడిట్ చేసింది ఎవరో చెప్పాలని ఉపాసన(Upasana) కొరారు. అయితే ఇప్పుడు ఉపాస‌న షేర్ చేసిన ఈ ఫొటో భారీ  వివాదానికి కార‌ణ‌మైంది. ఆల‌య శిఖ‌రం ఎంతో ప‌విత్ర‌మైంద‌ని, దానిపై మ‌నుషులు ఉండేలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ నిజంగా ఎవ‌రో తెలిస్తే చెప్పండి.. అస‌లైన స‌న్మానం చేస్తాం.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అందులోను ఈ ఫోటోలో ఉన్న మనుషులు చెప్పులతో కనిపించడం.. అలా గోపురంలపై నిలుచున్నట్టు ఉండటంతో నెటిజన్ల కోపం ఇంకా పెరిగిపోయింది. ఈ విధ‌మైన ఫొటోను షేర్ చేసిన ఉపాస‌న‌(Upasana)పై కూడా వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హిందువుల‌ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. వెంట‌నే ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, ఆ ఫొటోను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios