అజ్ఞాతవాసి పై ఉపాసన షాకింగ్ ట్వీట్

First Published 11, Jan 2018, 12:59 PM IST
upasana shocking tweet on agnyathavaasi
Highlights
  • పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి
  • ఉపాసన అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు అమెరికాలో చెర్రీ ఏర్పాట్లు
  • చెర్రీకి థాంక్స్ చెప్తూ.. కొణిదెల మ్యాజిక్ అంటూ ఉపాసన ట్వీట్
  • అజ్ఞాతవాసిపై ఉపాసన ట్వీట్ పై ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్

టాలీవుడ్ క్రేజీ దంపతుల్లో ముందుండే ఉపాసన, రామ్ చరణ్ ల అనుబంధం నిత్య నూతనంగా అనిపిస్తుంటుంది. పరస్పరం ప్రేమానురాగాలతో ఇద్దరూ... జాలీగా లైఫ్ ని గడిపేస్తూ చాలా ఇనిస్పైరింగ్ గా అనిపిస్తుంటారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ హీరో పవర్ స్టార్ అజ్ఞాతవాసి సినిమా వస్తోందని అభిమానులు ఎంతగా ఆనందపడ్డారో అందరికి తెలిసిందే. సినిమా విడుదలకు వారం ముందు నుంచే ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. జనవరి 10 కోసం చాలా క్యూరియస్ గా వెయిట్ చేశారు. సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన 10 నిమిషాలకే ఫుల్ అయిపోయాయి.

 

అజ్ఞాతవాసి రిజల్ట్ ఎలావున్నా... సినిమా తారలు కూడా స్పెషల్ షో వేయించుకొని మరి సినిమా చూశారు. ముఖ్యంగా కొంత మంది కుర్ర హీరోలు స్పెషల్ గా గుంపు గుంపులుగా సినిమాకు వెళ్లారు. అయితే మెగా ఫ్యామిలిలో కూడా అందరు సినిమాను చూసేశారని తెలుస్తోంది.

 

ఇక వారందరికంటే స్పెషల్ గా చరణ్ దంపతులు ముందే చూసేశారట. ఆ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఓ పని మీద అమెరికా వెళ్లిన ఉపాసనకు చరణ్ అజ్ఞాతవాసి షోని చూపించాడట. సతీమని కోసం ముందే ప్లాన్స్ వేసుకున్నట్లు ఉపాసన ట్వీట్ ని చూస్తే అర్ధమవుతోంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టీల్స్ ని కూడా ఉపాసన పోస్ట్ చేస్తూ.. కొణిదెల మ్యాజిక్ అని కామెంట్ చేసింది. ఇక అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. ఉపాసన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

 

ఓ పక్క మిక్స్ డ్ టాక్ తో అజ్ఞాతవాసి నడుస్తున్న నేపథ్యంలో.. ఉపాసన కొణిదెల మ్యాజిక్ అంటూ ట్వీట్ చేయటంపై ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉపాసన కామెంట్ అజ్ఞాతవాసి గురించి కాదని, ఆ మూవీకి టికెట్స్ తో పాటు, యుఎస్ లో వున్న తాను చూసేందుకు అన్ని రకాలుగా ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేయించిన రామ్ చరణ్ కు అని కొందరు వాదిస్తున్నారు. మరి ఉపాసన కామెంట్ అజ్ఞాతవాసి గురించో, చెర్రీ గురించో గాని.. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. 

 

loader