హీరో రామ్ చరణ్ (చెర్రీ) ఈ ఏడాది క్రిస్టమస్ వేడుకలను దివ్యాంగ బాలలతో కలిసి జరుపుకున్నవిషయం తెలిసిందే. ఆయన భార్య ఉపాసన కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ఈ విశేషాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఊరికే షేర్ చేసుకోవడం  కాదు. ఈ చిన్నట్వీట్ తో ఆమె రామ్ చరణ్ వ్యక్తి త్వాన్ని ఆవిష్కరించారు. రంగస్థలం సినిమాలో చరణ్ క్యారెక్టర్ పై హింట్  కూడా ఇచ్చారు. చిన్నారులతో సరదాగా గడిపిన వీడియోని ఫోటోలను ట్విట్టర్ లో  షేర్ చేస్తూ  చరణ్ ఈ చిన్నారులకు ఇంతగా ఎందుకు దగ్గరయ్యారో మీకు త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.

 

చెర్రీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలంలో సినిమాతో బిజీగతా ఉన్నాడు.  ఇందులో ఒక విశేషం గురించి ఇన్ పర్మేషన్  లీకయింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్  గుసగుస. అయితే ఇదిఇంకా ధృవపడాల్సి ఉంది. చిత్ర నిర్మాతలు  ఇంతవరకు రంగస్థంలో చరణ్ క్యారెక్టర్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉపాసన ఇచ్చిన హింట్ వల్ల తను చేస్తున్న పాత్ర మూలంగానే దివ్యాంగుల సమస్య ఆయనకు బాగా దగ్గిరయ్యారని అనుకోవాలి. చెర్రీకి వారి మీద ఎనలేని అభిమానం ఏర్పడిందని , వారికి చాలా దగ్గరయ్యేందుకు రంగస్థలమేకారణమని అంటున్నారు. అది తొందర్లో అధికారికంగా  ప్రకటిస్తారు. ఉపసాన హింట్ చేసింది కూడా అదేనంటున్నారు.