మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్, రెండు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

 

ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి కూడా ముఖ్య పాత్రలు పోశిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే పూర్తయిందట. ఆ విషయాన్ని తెలియచేస్తూ చిట్టిబాబు షూటింగ్ పూర్తైంది అంటూ చిట్టిబాబు లుక్ లో ఉన్న చరణ్ తో ఉపాసన పిక్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్ లో ఉండే ఉపాసన ట్విట్టర్ లో పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేస్తుంది.

 

అందులో భాగంగానే చరణ్ రంగస్థలం షూటింగ్ పూర్తయిన వార్తను ట్వీట్ ద్వారా వెళ్లడించారు. అంతేకాదు మార్చి 30న మీ స్పందన కోసం అతడు ఎదరుచూస్తాడు అంటూ మెసేజ్ పెట్టింది. చిట్టిబాబుగా చరణ్ పూర్తి మేకోవర్ తో కనిపిస్తున్నాడు. సుక్కు, చెర్రి క్రేజీ కాంబోలో సినిమా అంచనాలను ఏర్పడేలా చేసింది.

 

 

సమ్మర్ సినిమా సందడిని మొదలు పెట్టేలా చరణ్ రంగస్థలం మార్చి 30న వస్తుంది. ధ్రువ తర్వాత కెరియర్ మీద ఓ పర్ఫెక్ట్ ఆలోచనతో కనిపిస్తున్న చరణ్ ఈ రంగస్థలంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.