Asianet News TeluguAsianet News Telugu

ఉపాసన ప్రెగ్నెన్సీ... జోరందుకున్న ప్రచారం

  • రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రెగ్నెన్సీపై మళ్లీ ప్రచారం
  • ఈసారి ఉపాసన గర్భవతి అయిందని వార్తలు
  • మెగా వారసుడు రావాలని కోరుకుంటున్న మెగా అభిమానులు
upasana pregnency news rounding again

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. అయితే పెళ్లయి ఇన్నేళ్లయినా తమకు మెగా వారసుడిని ఇవ్వకపోవడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఆ మధ్య రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలొచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోవటంతో అభిమానులు నిరాశపడ్డారు. అయితే తాజాగా మళ్లీ ఉపాసన ప్రెగ్నెన్సీపై ప్రచారం జోరందుకుంది. ఈ సారైనా ఉపాసన ప్రెగ్నెన్సీ నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

మరోవైపు రెండు నెలల క్రితం పిల్లల్ని కనే ఉద్దేశం ఇప్పుడే లేదని, మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పారు. నేనింకా చిన్న పిల్లాడనని భావిస్తుంటాను. ఇంకా మెచ్యురిటీ రావాలి. పెద్దవాడినవ్వాలి. నన్ను నేను హ్యాండిల్ చేసుకొనే శక్తి వచ్చినప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడు అలాంటి ప్లాన్స్ లేవు అని చరణ్ తేల్చి చెప్పారు.

 

మరొవైపు ఉపాసన కూడా ప్రెగ్నెన్సీ గురించి స్పందిస్తూ... నేను బరువు తగ్గడానికి నేను చాలా సమయం వెచ్చించానని, మల్లీ ఇపుడు కూర్చుని బరువు పెరగదల్చుకోలేదని, మేము ఇంకా చిన్న వయసులోనే ఉన్నామని అంది. నాకు నిజంగా పిల్లలు కావాలనుకుంటే నా వెనక మొత్తం అపోలో ఉంది. నేను పిల్లల్ని కంటాను. కానీ అది మా వ్యక్తిగతం. ప్రపంచం మొత్తం తెలియాలనుకోను. అది మా పర్సనల్. కొన్ని అలాగే పర్సనల్ గా ఉంచాలి. అలాగే ఉంచుతాను... అంటూ చెప్పింది ఉపాసన.

 

తమ ఇల్లు కూడా ఇంకా సిద్ధంగా లేదని ఉపాసన చెప్పుకొచ్చింది. అన్నీ ప్లాన్ ప్రకారం చేసుకోవాలి అనుకుంటున్నాను. చరణ్ నాతో కొన్ని రోజులు ఉండాలని ఉపాసన తెలిపారు. అయితే... కొన్ని ప్లాన్ చేసినా, చేయకున్నా... అలా జరిగిపోతాయంతే. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే జరిగిందని... త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఖండనలైతే రాలేదు మరి.

Follow Us:
Download App:
  • android
  • ios