మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా కనిపిస్తారో స్పెషల్ గా చెప్పనవసరమే లేదు. మెగా ఫ్యామిలి ఎలాంటి ఈవెంట్ జరిగినా ఆమె ముందుండి చూసుకుంటారు. ఇక మామ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు కూడా ఉపాసన ఇంట్లో స్పెషల్ గా కేక్ కట్ చేసి సందడి చేసింది. 

అలాగే మూడు తరాల కొణిదెల కోడళ్ళు అంటూ స్పెషల్ ఫొటోని అభిమానులతో పంచుకుంది. మెగాస్టార్ తల్లి అంజనా దేవి అలాగే భార్య సురేఖ తో పాటు కోడలు ఉపాసన కలిసి దిగిన ఫొటో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే మరో ఫొటోలో రామ్ చరణ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి పోటీకి స్టిల్ ఇచ్చాడు.