రామ్‌చరణ్, శర్వానంద్ కాంబినేషన్‌లో ఉపాసన సినిమా.. అసలు విషయమేంటంటే?
శర్వానంద్, రామ్‌చరణ్ కలిసి సినిమా చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్ చెర్రీ భార్య ఉపాసన సినిమా నిర్మించబోతుందా? అంటే అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు.
శర్వానంద్, రామ్‌చరణ్ కలిసి సినిమా చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్ చెర్రీ భార్య ఉపాసన సినిమా నిర్మించబోతుందా? అంటే అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు. చరణ్, శర్వానంద్ కాంబినేషన్‌లో అపోలో ఫార్మసీ వైస్ చైర్మన్ అయిన ఉపాసన సినిమా ప్లాన్ చేస్తుందంటున్నారు. అయితే ఇది ఫీచర్ ఫిల్మ్ కాదని, ఓ షార్ట్ ఫిల్మ్ అని అంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వారిలో వైద్యులు మొదటి వరుసలో ఉంటారు.
డాక్టర్స్ గొప్పతనం, వారి ప్రాముఖ్యతని తెలియజేసేలా ఉపాసన ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో హీరో శర్వానంద్ డాక్టర్‌గా నటిస్తారని, అతిథి పాత్రలో హీరో రామ్‌చరణ్ కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చరణ్ `ఆర్‌ఆర్‌ఆర్`తోపాటు `ఆచార్య`లో నటిస్తున్నారు. ఇక శర్వానంద్ `మహాసముద్రం`లో, `ఆడవాళ్లు మీకు జోహార్లు`తోపాటు ఓ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నాడు.