మెగా కోడలిగా అభిమానుల మెప్పు పొందిన ఉపాసన రామ్ చరణ్ అంటే మెగాస్టార్ తనకిచ్చిన గిఫ్ట్ అంటున్న ఉపాసన మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుందట
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సంవత్సరాలుగా ఆయన పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకి పండగ రోజే.
అలాంటి చిరంజీవి కి ఆయన కోడలు ఉపాసన సూపర్ డూపర్ గిఫ్ట్ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా కామినేని ఉపాసన ఆయనకి ఒక గిఫ్ట్ ప్రామిస్ చేసారట. చిరంజీవి తనకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రామ్ చరణ్ అని, అతనితో పాటు కుటుంబాన్నంతటినీ ఎల్లవేళలా సంతోషంగా ఉంచడానికి తాను ప్రయత్నిస్తానని మామయ్యకు ప్రామిస్ చేసినట్లు ఉపాసన తెలిపారు.
ఈ ప్రామిస్‌ను నిలుపుకోవడం ఒక అందమైన బాధ్యత అని ఆమె అన్నారు. " చిరంజీవి అంటే నాకు చాలా నమ్మకం. నేను చేసే ప్రతీ పనిలో ఆయన సపోర్ట్ తో పాటు పొగడ్త ఉంటుంది. ఆ పని ఇంకా బాగా చెయ్యాలి అనే ఉత్సాహం ఆయన నుంచి నేను పొందుతూ ఉంటాను. " అన్నారు ఆమె. అలాగే రామ్ చరణ్‌కి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ అని, చిరంజీవి మాస్టర్ అయితే చరణ్ స్టార్ శిష్యుడని ఆమె అన్నారు.
