గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది. మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు మెగా కుటుంబం సైతం తమ అభిమానులకు అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మరోసారి ఇనిస్ట్రా ద్వారా మరోసారి అందరికి కృతజ్ఞతలు చెప్పారు. డెలివరీ అయ్యాక మొదటి స్పందన ఇదే అని చెప్పాలి.
ఇక ఉపాసన ఆసుపత్రి నుంచి ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన ఇంటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.
కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ప్రస్తుతం ఉపాసన అపోలో వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇక రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్నాడు..!!
మరో ప్రక్క తాతయ్య చిరంజీవి మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.ఈ మధ్యకాలంలో తమ కుటుంబంలో జరిగిన శుభలన్నీ ఉపాసన కూతురు వలనే అంటూ గొప్పగా చెప్పుకోవచాడు చిరంజీవి. గొప్ప ఘడియల్లో రామ్ చరణ్ బిడ్డ పుట్టిందని అంటున్నారు. మంగళవారం రోజు మా ఇష్ట దైవం హనుమాన్ ఆశీస్సులతో అమ్మాయి పుట్టిందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు చిరంజీవి.
