బాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు సల్మాన్ ఖాన్. ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ అతడి క్రేజ్ తగ్గడం లేదు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన 'భారత్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది.

ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన.. సల్మాన్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేశారు. ఫిట్ నెస్, హెల్త్ కి సంబంధించి ఉపాసన 'బి పాజిటివ్' అనే మ్యాగజైన్ ని నడిపిస్తోంది. ఈ మ్యాగజైన్ ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ప్రచురిస్తున్నారు.

వారి ఫిట్ నెస్ రహస్యాలు, డైట్, హెల్త్ కేర్ గురించి అడిగి తెలుసుకొని ఆ విషయాలను పాఠకులతో పంచుకుంటున్నారు. అలానే ఇంటర్వ్యూ వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉపాసన.. సల్మాన్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేశారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పిన ఉపాసన.. సల్మాన్ వీడియోకి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ని కూడా షేర్ చేశారు. 'మీ రహస్యాలు మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్.. సల్మాన్ భాయ్ లోని కొత్త కోణాన్ని త్వరలోనే చూపించబోతున్నాం' అంటూ ట్వీట్ చేశారు.