రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి వివిధ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్నారు. ఉపాసన మాత్రం తన తల్లి దండ్రుల మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్ళింది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.
రాంచరణ్, ఉపాసన పిల్లల్ని కనడం గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరగడం చూస్తూనే ఉన్నాం. ఇక అభిమానులైతే మెగా వారసుడి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించేలా కొన్ని వారాల క్రితం రాంచరణ్, ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నట్లు మెగా ఫ్యామిలీ ప్రకటించింది. ఈ శుభవార్త మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఉపాసన అపోలో సంస్థ అధినేత వారసురాలే కావడంతో హెల్త్ పరంగా ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి వివిధ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్నారు. ఉపాసన మాత్రం తన తల్లి దండ్రుల మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్ళింది.
తల్లి దండ్రులతో కలసి ఆమె బ్యాంకాక్ లో సరదాగా గడుపుతోంది. తాజాగా ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హ్యాపీ మమ్మి హ్యాపీ బేబీ అని ఉపాసన పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఉపాసన తన తల్లి దండ్రులతో కలసి బ్యాంకాక్ లో స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేశారు. 78 ఏళ్ల వృద్ధురాలు చేసిన టేస్టీ ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు ఉపాసన కామెంట్ పెట్టింది.
అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. దయచేసి అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ తినొద్దు అని రిక్వస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం హెల్త్ కేరింగ్ లో ఉపాసనకు తెలియని విషయాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఉపాసన ఫొటోస్ పై కాజల్ అగర్వాల్ ఆమె అమేజింగ్ పర్సన్ అని కామెంట్ పెట్టింది.
