`హిట్` కొట్టడానికి మీడియాని గెలకడం అవసరమా?
`హిట్2` చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. `హిట్2`లో మీడియాని లాగడం డిస్కషన్ పాయింట్‌గా మారింది. ఇందులో అది కాస్త ఓవర్‌గా చూపించారని అంటున్నారు.

నాని(Nani) నిర్మాణంలో `హిట్`(Hit) ఫ్రాంఛైజీ క్రియేట్ అయ్యింది. దీనిపై మొదటి సినిమా విడుదలైనప్పట్నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. `హిట్2`(Hit2) ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. ఎన్నో అంచనాల నడుము శుక్రవారం(డిసెంబర్ 2) విడుదలైన `హిట్2` సినిమా యావరేజ్‌గానే మిగిలిపోయింది. `ఏ` సెంటర్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. `హిట్2`లో మీడియాని లాగడం డిస్కషన్ పాయింట్‌గా మారింది. ఇందులో అది కాస్త ఓవర్‌గా చూపించారని అంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది దర్శకులు, హీరోలు మీడియాని టార్గెట్ చేస్తూ తమ సినిమాల్లో సెటైర్లు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా `హిట్2`లోనూ అడవిశేషు(Adivi Sesh) అదే చేశాడు. కావాలని ఇందులో మీడియాని ఇరికించి గెలికినట్టుగా సన్నివేశాలు ఉండటమే అందుకు కారణం.
సినిమాలో మర్దర్ జరిగినప్పుడు మొదట మీడియానే సీన్‌కి వచ్చినట్టు చూపించడంతోపాటు ఫస్ట్ మీడియాపైనే కామెంట్ చేశాడు అడవిశేషు. మెయిన్ మర్డర్ కేసులో ప్రతి సారి ఆయన మీడియాని చూపించారు. `టీలు తాగడం అయిపోయిందా?, ముందు టీలు తాగండి అంటూ, ఇలా మీడియాపై సీరియస్ గా రియాక్ట్ అవడం, సెటైర్లు వేయడం, అవసరం లేని సందర్భంలోనూ, సీరియస్‌గా కేసు ఇన్వెస్టిగేషన్ టైమ్‌లోనూ మీడియాని చూపించి వాళ్లని తక్కువ చేసే సన్నివేశాలు పెట్టడం మీడియా సంస్థలను అవమాన పరిచేలా ఉందని అంటున్నారు.
దీనిపై మీడియా జనాలు కాస్త అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేని సన్నివేశాల్లోనూ మీడియాని లాగడం అసహజంగా ఉంది. అది కావాలనే టార్గెట్ చేసినట్టుగా ఉందని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నాని, దర్శకుడు శైలేష్ కొలను, అడవిశేషు ఇలా ఎందుకు చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. నిజానికి వీళ్లంతా మీడియా సపోర్ట్ తోనే వచ్చారు. నేచురల్ స్టార్‌గా రాణించే నాని స్టార్‌గా ఎదగడంలో మీడియా పాత్ర చాలా కీలకమైంది. అది ఆయనకూ తెలుసు. అడవిశేషుని సైతం మీడియా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఆయన ఎంచుకునే కథల విషయంలో ఎంతో విభిన్నతని చూపిస్తాడని ప్రశంసించింది మీడియానే. అదే ఆయన్ని ఇండస్ట్రీలో స్పెషల్‌గా మార్చింది. మరోవైపు దర్శకుడు శైలేష్ విషయంలో మీడియా సపోర్ట్ గానే ఉంది.
అయితే రియల్ లైఫ్ మర్డర్ మిస్టరీలలో మీడియాల వ్యవహారాన్ని ఉద్దేశించి ఇలా చేసి ఉంటారా? అభిప్రాయం కూడా ఉంది. కానీ అది సహజంగా చూపించవచ్చు. బట్ ఇందులో కావాలని ఇరికించిన సీన్లు కనిపించడమే డైజెస్ట్ కావడం లేదు. ఇంత చేసి చివర్లో హీరో మీడియాపైనే ఆధారపడటం గమనార్హం. మొత్తానికి `హిట్` కోసం మీడియాని గెలకడం అవసరమా? అనే అభిప్రాయం అందరిలోనూ వినిపిస్తుంది. అడవిశేషు హీరోగా మీనాక్షి చౌదరి కథానాయికగా శైలేష్ కొలను దర్శకత్వంలో `హిట్2` రూపొందిన విషయం తెలిసిందే. నాని నిర్మించారు.