Asianet News TeluguAsianet News Telugu

#Unstoppable2: షాకింగ్ ...మాజీ సీఎం కాదు.. మాజీ హీరోయిన్!?

 రాజకీయ నాయకులను కూడా షోకి తీసుకొస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మరో ఇద్దరు రాజకీయ నాయకులని రంగంలోకి దింపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారు ఎవరో కాదు..

Unstoppable with NBK 2: Guest Locked for the next Episode
Author
First Published Nov 14, 2022, 7:37 AM IST

 నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఆహా టాక్స్ షో సెకండ్ సీజన్ కూడా సూపర్ హిట్ అయింది.  ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి ఎపిసోడ్ లో తన బావ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తో ప్లాన్ చేయగా ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది.ఈ క్రమంలో రెండవ ఎపిసోడ్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరితో సెకండ్ ఎపిసోడ్ చేసి రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. 

అయితే మూడో ఎపిసోడ్ షూటింగ్ విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడడంతో మొదటి ఎపిసోడ్ ని అన్ సెన్సార్ వెర్షన్ అని చెప్పి మరో అరగంట పాటు మరిన్ని ప్రశ్నలు యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్లో హీరోలు అడవి శేష్, శర్వానంద్ ఇద్దరినీ కలిపి ఒక ఎపిసోడ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే ఈ సెకండ్ సీజన్లో ఊహించని విధంగా సీనియర్ హీరోయిన్ ని రాధికను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మొత్తం రెడీ అయ్యిందని తెలుస్తోంది. బాలయ్యకు ఆమెతో ఉన్న అనుబందం, అప్పటి సినిమాల ముచ్చట్లు, ఆమెకు ముగ్గురుతో వివాహం వంటి టాపిక్ లతో పాటు, చిరంజీవితో ఆమె సినిమాలు చేసేటప్పుడు ఎక్సపీరియన్స్ లు చెప్పబోతున్నారట. అలాగే చిరంజీవికి సంభందించిన కొన్ని ఫన్నీ సీక్రెట్స్ కూడా ఆమె ముచ్చటిస్తుందిట. ఇలా రాధికతో పూర్తి స్దాయిలో ఫన్ అండ్ ఎమోషనల్ ఎక్సీరియిన్స్ గా ఈ ఎపిసోడ్ ని బాలయ్య ప్లాన్ చేస్తున్నారని వినికిడి. 

ఇదిలా ఉంటే రాజకీయ నాయకులను కూడా షోకి తీసుకొస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మరో ఇద్దరు రాజకీయ నాయకులని రంగంలోకి దింపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారు ఎవరో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి అని  అంటున్నారు. అయితే అందులో నిజం లేదని చెప్తున్నారు. వాళ్లను అడగటం అయితే జరిగింది కానీ వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. ఏది నిజం అనేది నాలుగు రోజుల్లో తేలిపోనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios