నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సక్సెస్ ఫుల్ టాక్ షో ‘అనస్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2’ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పై అఫీషియల్ అప్డేట్ అందింది.
నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) హోస్టింగ్ చేస్తున్న సక్సెస్ ఫుల్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2’ (Unstoppable with NBK Season 2). ‘ఆహా’లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఫస్ట్ సీజన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య.. సెకండ్ సీజన్ లోనూ అదరగొడుతున్నారు. ఈ సారి ఇండస్ట్రీలోని స్టార్లతో పాటు ప్రముఖులను కూడా ఆహ్వానిస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు మరింత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు సీజన్లతో దుమ్ములేపుతున్న షో నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ అందింది.
ఎప్పటి నుంచో ఈ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై ఆహా అధికారిక ప్రకటన చేసింది. త్వరలో బాహుబలి ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విచ్చేస్తున్నారని అప్డేట్ అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్, బాలయ్యకు సంబంధించిన మాస్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
డిసెంబర్ 11న (నేడు) ఈ అవైటెడ్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు, టాలీవుడ్ నటుడు గోపీచంద్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరితో షోచేస్తే రచ్చ మామూలుగా ఉండదనే తెలిసిందే. త్వరలోనే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఇలాంటి షోలో రాబోతుండటం, అదీ బాలయ్యతో వస్తుండటం ఆసక్తికరంగా మారింది.
