రెండు ఎపిసోడ్స్ కింద విడుదల చేస్తున్నారు. మొదట 'బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1ను డిసెంబర్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు ముందుకు తీసుకు వచ్చారు.  


బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'ఆహా' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 2'కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దానిని రెండు ఎపిసోడ్స్ కింద విడుదల చేస్తున్నారు. మొదట 'బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1ను డిసెంబర్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు ముందుకు తీసుకు వచ్చారు. 

Scroll to load tweet…

''డార్లింగ్ ఫ్యాన్స్... మీ కోరిక మేరకు, మన 'బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1 ఈ రోజే రిలీజ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కొంచెం ముందు స్టార్ట్ చేద్దాం. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది'' అని 'ఆహా' ఓటీటీ ట్వీట్ చేసింది. ప్రభాస్, గోపీచంద్ లు గెస్ట్ లుగా వచ్చిన ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' వర్గాలు పేర్కొన్నాయి. రెండు గంటలకు 20 నిమిషాలు తక్కువ అన్నమాట. దీనిని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు. 

మొదటి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఇక రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌, ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్, బాల‌కృష్ణ మ‌ధ్య సంభాషణను చూపిస్తారు. ఇంత గొప్ప ఎపిసోడ్‌ ను ఎడిట్ చేయ‌టానికి చాలా క‌ష్ట‌ప‌డుతోంది యూనిట్. ఎందుకంటే ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దే. దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాలి.

 ఈ పార్ట్ 1 కోసం ఓ స్పెషల్ ప్రోమో విడుదల చేశారు. అందులో రామ్ చరణ్ ఫోన్ చేసినప్పుడు ''ముందు నా సినిమా చూడు, తర్వాత మీ నాన్నగారి సినిమా చూడు'' అని బాలకృష్ణ చెప్పడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

 మరోవైపు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌ కూడా రాబోతుంది. అన్‌స్టాపబుల్‌ షోకు త్వరలోనే పవన్‌కల్యాణ్‌తోపాటు డైరెక్టర్లు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.