హీరోయిన్ కు బెదిరింపు ఫోన్ కాల్స్!

unknown man threatening phone calls to heroine
Highlights

కొద్దిరోజుల క్రితమే ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి విషయంలో హీరో దిలీప్

కొద్దిరోజుల క్రితమే ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి విషయంలో హీరో దిలీప్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మర్చిపోకముందే మరో నటిని బెదిరిస్తూ కొందరు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు. తమిళ వర్ధమాన నటి తాన్యను చంపుతామని కొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్లు చేసి ఆమెను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ సినిమాలో నటించిన కారణంగా ఆమెను హత్య చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయంపై వేప్పేరి పోలీసులకు ఆమెకు ఫిర్యాదు చేశారు. వడపళనిలోని తన తల్లితో పాటు నివాసం ఉంటోన్న తాన్యకు ఈ నెల 14న రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చిందట. ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఆమెను అసభ్యపదజాలంతో దూషిస్తూ నిన్ను చంపేస్తామని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు. నేను బయటకు వస్తే నీ పని చెప్తానని వార్నింగ్ ఇచ్చాడట.

సినిమాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే దర్శకనిర్మాతలతో సెటిల్ చేసుకోమని చెప్పినా వినలేదట. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.  

loader