Bigg Boss Telugu 7: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. ఇంటిని వీడేది ఆ కంటెస్టెంటేనా?
`బిగ్ బాస్ తెలుగు 7`హౌజ్ ఐదో వారం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది ఉత్కంఠకి గురి చేస్తుంది. కానీ ఈ సారి ఊహించని ఎలిమినేషన్ ఉంటుందట.

బిగ్ బాస్ తెలుగు 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారం కూడా చివరి దశకు చేరుకుంది. రేపటితో ఐదో వారం కూడా ముగిసినట్టే. అయితే 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడు పది మంది మాత్రమే ఉన్నారు. నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో నలుగురూ లేడీ కంటెస్టెంట్లే కావడం గమనార్హం. ఇంకా మిగిలింది. ముగ్గురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు.
క్రమంగా గ్లామర్ పాళ్లు తగ్గుతున్నాయి. కానీ ఈ వారం కూడా షాలింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందట. గత వారం తేజ జస్ట్ మిస్ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. ఈ వారం ఓటింగ్‌లో అతనికి తక్కువగానే వచ్చాయని, అయితే కెప్టెన్సీ టాస్క్ లో పుంజుకున్నాడని తెలుస్తుంది. కానీ అమర్ దీప్, ప్రియాంకలు వెనకబడ్డారట. లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం అమర్ దీప్, ప్రియాంకల మధ్య ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది.
అయితే ఇక్కడే ఓ షాకింగ్ విషయం చక్కర్లు కొడుతుంది. ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది. ప్రియాంక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వాదనలో అంతో ఇంతో తన ప్రదర్శన ఇచ్చాడు అమర్ దీప్. కానీ వాదించడంలో ప్రియాంక వెనకబడిందని తెలుస్తుంది. దీంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే జరిగితే కచ్చితంగా ఇది షాకింగ్ ఎలిమినేషన్ అవుతుందని టాక్.
ఇదిలా ఉంటే ఈ వారం హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్లు రాబోతున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు హౌజ్ లోకి ఆరుగురు ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ యమ రంజుగా మారింది. కెప్టెన్సీ టాస్క్ కోసం కోట్లాడుకున్న తీరు పీక్‌కి వెళ్లింది. నిజంగానే కొట్టుకునేలా ప్రవర్తించడం విశేషం. ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, సందీప్, ప్రశాంత్, యావర్, అమర్‌దీప్, గౌతంకృష్ణ, తేజ, శోభా శెట్టి, శుభ శ్రీ, ప్రియాంకలున్నారు. వీరిలో సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ పవర్ అస్త్ర కారణంగా నామినేషన్లో లేరు. మిగిలిన ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు.